Ravichandra dental hospital

Ravichandra dental hospital A DESTINATION FOR COSMETIC LASER DENTISTRY AND IMPLANTOLOGY

26/08/2025
*డాక్టర్ అనీల్ గుప్త ఆద్వర్యంలో అరుదైన శస్త్రచికిత్స..!!* *పోతుందనుకున్న ప్రాణాన్ని పొదివిపట్టి..రక్షించారు..!!💞* *మహబూబ...
04/11/2023

*డాక్టర్ అనీల్ గుప్త ఆద్వర్యంలో అరుదైన శస్త్రచికిత్స..!!*

*పోతుందనుకున్న ప్రాణాన్ని పొదివిపట్టి..రక్షించారు..!!💞*

*మహబూబాబాద్ రవిచంద్ర సూపర్ స్పెషాలిటీ దంతవైద్యశాలలో అరుదైన శస్త్రచికిత్స..👌*

*103 డిగ్రీల జ్వరంతో ఇబ్బంది పడుతూ..!! మూడుగంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ అనీల్ గుప్త..*

*ముఖానికి పూర్వపు ఆకృతి తెచ్చిన ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ అనీల్ గుప్త..*

మహబూబాబాద్ జిల్లాకలెక్టరేట్ సమీపంలో ఓ..రోడ్డుప్రమాదం జరిగింది.. *రక్తపుమడుగులో గుర్తుపట్టడానికే వీలులేని విధంగా ముఖం మొత్తం తీవ్రగాయాలతో చెత్త..చెత్తగా చిత్తుగా పగిలిపోయింది..*

ప్రాణపాయస్థితిలో ఉన్న *బయ్యారం మండలం కస్తూరినగర్* కు చెందిన *నరేష్ ను* హుటాహుటిన మహబూబాబాద్ లో నూతనంగా ప్రారంభం అయిన *ధరణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి* తరలించారు.

*రక్తస్రావాన్ని అదుపుచేసిన అనంతరం.. అనంతర చికిత్సకోసం ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ అనీల్ గుప్తను సంప్రదించారు..* *

*103 డిగ్రీల వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ..!! డాక్టర్ అనీల్ గుప్త బాదితుని పరిస్థితిని, ఆ..కుటుంబ అభ్యర్ధనను చూసి చలించిపోయారు.*

*అరుదైన, అత్యంత ఆధునికమైన పద్దతిలో చేయాల్సిన శస్త్రచికిత్సను డాక్టర్ అనీల్ గుప్త ఓ..చాలెంజ్ గా తీసుకున్నారు..* 👍*

*తీవ్రమైన జ్వరంతోనే, డాక్టర్ విజయ్ కుమార్ తో కలిసి అనీల్ గుప్త ఈ..శస్త్రచికిత్స ప్రారంబించారు.*

*ముఖం, మూతి, దంతాలు పూర్తిగా చిద్రమైపోయిన నరేష్ కు సుమారు మూడుగంటలపాటు అత్యంత ఆధునిక వైద్యవిధానాలతో శ్రమించి చికిత్స అందించారు.*

*విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తిచేసారు.*

*మనిషి ఆకారం, ముఖం ఎలా మారిన పర్వాలేదు.., ప్రాణాలు దక్కితే చాలనుకున్న ఆ..కుటుంబం శస్త్రచికిత్స తర్వాత నరేష్ ను ముఖాన్ని చూసి ఆశ్చర్య పోయారు..!!*

*103 డిగ్రీల జ్వరాన్ని, తన అనారోగ్యాన్ని సహితం లెక్కచేయకుండా బాదితునికి శస్త్రచికిత్స చేసి మళ్ళీ యదారూపాన్ని ప్రసాదించిన డాక్టర్ అనీల్ గుప్తకు నరేష్ తోపాటు ఆ..కుటుంబమంతా దన్యవాదాలు తెలిపింది..🙏*

*ఆదునిక నగరాలకు, కార్పోరేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమనుకునే ఆధునిక వైద్యసౌకర్యాలను మన..మహబూబాబాద్ లో అందుబాటులోకి తెచ్చి అనేకమంది పేద, మద్యతరగతి ప్రజలకు సేవాబావంతో వైద్యసేవలు అందించే రవిచంద్ర సూపర్ స్పెషాలిటీ దంతవైద్యశాల డాక్టర్ అనిల్ గుప్త అభినందనీయులు..🤝💐*

పిఆర్ టియు టీఎస్ టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ అనిల్ గుప్త..  ఈ కార్యక్రమంలో జిల్లా...
11/01/2021

పిఆర్ టియు టీఎస్ టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ అనిల్ గుప్త.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంకా.బద్రినారాయణ, ప్రధాన కార్యదర్శి మిరియాల సతీష్ రెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు గీత, భూక్య రాంజీ నాయక్.. రాష్ట్ర జిల్లా మండల మరియ ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు

పాపం పసివాడికి గ్రహణం పట్టింది..😢  పౌష్టికాహారలోపమే ప్రదానకారణం..!! చిన్నారి పరిస్థితి చూసి చలించిన దంతవైద్యుడు..   గ్రహ...
20/11/2020

పాపం పసివాడికి గ్రహణం పట్టింది..😢 పౌష్టికాహారలోపమే ప్రదానకారణం..!! చిన్నారి పరిస్థితి చూసి చలించిన దంతవైద్యుడు.. గ్రహణం నుండి విముక్తి చేస్తానని డాక్టర్ అనీల్ గుప్త హామీ..👍 తమ..ఇంటికి కొత్తవెలుగు తెచ్చే మగబిడ్డ పుట్టాడనే ఆనందం ఆ..తల్లిదండ్రుల కళ్ళల్లో ఎంతోసేపు నిలవలేదు.. కేవలం 1.600కిలోల బరువుతో మాత్రమే పుట్టిన ఆ..పసిగుడ్డు మొహం చూడగానే తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.. పాపం.. ఆ..పసికందు గ్రహణమొర్రితో జన్మించాడు.. 😢 అసలే పేదరికం.. రెక్కాడితే డొక్కాడని జీవితం.. పుట్టినబిడ్డ పరిస్థితి ఇలా.. కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని వేల్పులసత్యనారాయ నగర్ కు చెందిన వినోద్..కళ్యాణి దంపతుల దయనీయ పరిస్థితి ఇది.. మగబిడ్డ పుట్టాడని ఆనందపడాలా.. గ్రహణమొర్రి తమబిడ్డకు జీవితాంతం శాపంగా మారిందని బోరున ఏడువాలో తెలియని విషాదంలో ఉన్న ఆ..కుటుంబానికి ఓ..ఆశాదీపం డాక్టర్ అనీల్ గుప్త రూపంలో కనిపించాడు.. గతంలో వందలాదిమంది గ్రహణమొర్రి బాదితుల జీవితాల్లో డాక్టర్ అనీల్ గుప్తా కొత్తవెలుగులు తెచ్చాడని... తమ జీవితం ఇక ఇంతే అని.. తమ ఆకారమే.. వికారమని ఆశలు వదులుకున్న అనేకమంది గ్రహణమొర్రి బాదితులకు కొత్తరూపాన్ని డాక్టర్ అనీల్ గుప్త ప్రసాదించాడని తెలుసుకున్న ఆ..పేదదంపతులు 13రోజుల పసిగుడ్డును పట్టుకొని మహబూబాబాద్ లోని రవిచంద్రసూపర్ స్పెషాలిటీ దంతవైద్యశాలకు చేరుకున్నారు.. తమ పసిబిడ్డను భగవంతుని పాదాల దగ్గర ఉంచినట్లుగా డాక్టర్ అనీల్ గుప్త చేతుల్లో పెట్టి బోరున విలపించారు.. పసిబిడ్డను ఆప్యాయంగా ఎత్తుకున్న అనీల్ గుప్త నేనున్నాననే దైర్యాన్ని ఆ..తల్లిదండ్రులకు అందించారు.. గర్బిణిగా ఉన్న సమయంలో సరిఅయిన పౌష్టికాహారం తీసుకోకపోవడం.. వైద్యుల సలహాలు.. వారందించే ఔషదాల వాడకంలో నిర్లక్ష్యం వహించడం వంటి వాటి మూలంగా.. బరువు తక్కువగా పుట్టడం.. గ్రహణమొర్రి వంటి అనేక ఇతర సమస్యలు రావడం జరుగుతుందన్నారు.. గర్బిణులు పై..సూచనలను తప్పక పాటించాలని డాక్టర్ అనిల్ గుప్త తెలిపారు.. ప్రస్తుతం బాలుని బరువు చాలా తక్కువగా ఉందని గ్రహణమొర్రి చికిత్స చేయడానికి కనీసం ఐదుకిలోల బరువు ఉండాలన్నారు.. ఆందోళన..ఆవేదన చెందాల్సిన అవసరం లేదని పసిబిడ్డ ఐదుకిలోల బరువు పెరగగానే ఖచ్చితంగా వైద్యం చేద్దామని మాట ఇచ్చారు.. ఆవిరైపోయిన ఆశలకు.. ఆయుష్షు పోసిన డాక్టర్ అనిల్ గుప్త ను చూసి ఆ..దంపతులు చేతులెత్తి దండంపెట్టారు.. గ్రహణమోర్రి.. తమ బిడ్డను జీవితాంతం గ్రహణంలా పట్టి ఉంటుందని కుంగిపోయిన ఆ..కుటుంబసభ్యులు తమ బిడ్డడు.. అందరిలాగే అందంగా అనిల్ గుప్త వైద్యంతో మారిపోతాడంటూ ఆనందంతో పొంగిపోయారు.. పేదరికంతో బాదపడుతున్న ఆ..కుటుంబాన్ని ఆదుకునేందుకు.. సామాజిక బాద్యతగా సుమారు రూ.2లక్షల ఖర్చు అయ్యే వైద్యాన్ని ఉచితంగానే అందిస్తానని డాక్టర్.అనీల్ గుప్త తెలిపారు.. గ్రహణమొర్రి బాదితులు ఎక్కడ ఉన్న తనను సంప్రదించాలని.. వారికి ఖచ్చితంగా వైద్యసహాయం అందించేందుకు తాను సిద్ధం గా ఉన్నానని అనిల్ గుప్తా తెలిపారు.. గ్రహణమొర్రి మూలంగా వికారపు ఆకారాలు శాపాలుగా వెంటాడుతున్న వందలాది జీవితాలకు సరికొత్త రూపం ఇచ్చిన.. ఇస్తున్న.. భవిష్యత్ లోనూ ఇవ్వనున్న మహబూబాబాద్ లోని ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ అనీల్ గుప్త అభినందనీయులు..🤝💐

Our preventive measures towards COVID 19
12/05/2020

Our preventive measures towards COVID 19

పెన్షనర్స్ డే సందర్బంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మహబూబాబాద్ జిల్లా వారిచే ప్రముఖ దంత వైద్య నిపుణ...
17/12/2019

పెన్షనర్స్ డే సందర్బంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మహబూబాబాద్ జిల్లా వారిచే ప్రముఖ దంత వైద్య నిపుణులు గౌరవ శ్రీ డాక్టర్. బి. అనిల్ గుప్త గారికి సన్మాన కార్యక్రమం చేయబడినది

14/11/2019

ATTENDED AS CHEIF GUEST AT MUSLIM MINORITY SCHOOL MAHABUBABAD ON THIS CHILDREN'S DAY SPECIAL

14/11/2019

ATTEND AS CHEIF GUEST AT MUSLIM MINORITY SCHOOL ON THIS CHILDRENS DAY SPECIAL

Address

4-5-99 DOCTORS Street MAHABUBABAD
Mahbubabad
506101

Opening Hours

Monday 9am - 8:30pm
Tuesday 9am - 8:30pm
Wednesday 9am - 8:30pm
Thursday 9am - 8:30pm
Friday 9am - 8:30pm
Saturday 9am - 8:30pm
Sunday 9am - 2:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ravichandra dental hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share