27/06/2024
కేర్ డెంటల్ హాస్పిటల్ మరియు ఆర్కే డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఓరల్ హెల్త్ ఫౌండేషన్ తో కలిసి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రగతి హై స్కూల్ లో ఈరోజు ఉచిత దంత పరీక్ష చేయబడ్డది ఇందులో డెంటల్ ప్రాబ్లం ఉన్న వారి కోసం కేర్ డెంటల్ హాస్పిటల్ మరియు ఆర్కే డెంటల్ హాస్పిటల్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి డెంటల్ సమస్య ఉన్నవరికి చికిత్స చేయించుకునే లాగా తెలంగాణ గవర్నమెంట్ ఆమోదించిన చార్జెస్ ని తీసుకోవడం అనేది ఈ హాస్పిటల్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం
ఈ ఉచిత దంత వైద్య శిబిరంలో డాక్టర్ మహమ్మద్ సమియోద్దీన్ గారు స్కూల్ విద్యార్థులకు బ్రషింగ్ టెక్నిక్స్ మరియు పుప్పి పళ్ళ గురించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.ముఖ్యంగా ఆరు సంవత్సరాల వయసులోనే పర్మినెంట్ దంతాలు వస్తాయి ముఖ్యంగా ఈ పర్మినెంట్ దంతాలు వచ్చినప్పుడు పిల్లలు చాక్లెట్స్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి వాటికి చాలా అలవాటు పడడం వలన ఆరు సంవత్సరాల వయసులో పర్మినెంట్ దంతాలు వచ్చిన తర్వాత దంతాలు పుప్పిపోవడం చిగురు లో నుంచి రక్తం రావడము మరియు దంతాలు వదులు అవ్వడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ముందుగానే సమస్యలను గుర్తించి దంత చికిత్సలు చేయించుకోవాలని విద్యార్థులను ఎక్స్ప్లెయిన్ చేశారు అదే విధంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఎత్తు వంకర పనులు ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లంస్ వస్తాయో విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఈ దంత వైద్య శిబిరంలో డాక్టర్ మొహమ్మద్ సమీయో ద్దిన్ ,డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ సిరాజ్ డాక్టర్ అక్షత మరియు డాక్టర్ మహేక అగర్వాల్ పాల్గొన్నారు